Hyderabad, ఫిబ్రవరి 17 -- Zee Telugu Shooting Live: మజాకా మూవీ టీమ్, జీ తెలుగు ఛానెల్ ఇప్పటి వరకూ ఎవరూ చేయని ప్రయోగం చేయబోతున్నారు. ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో చూపించబోతున్నారు. మజాకా మూవీలోని రావులమ్మ అనే సాంగ్ షూటింగ్ ను ఈ ఛానెల్ లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది. దీని విశేషాలేంటో చూడండి.

సినిమాల ప్రమోషన్ల కోసం మేకర్స్ కొత్త కొత్త ప్రయోగాలకు తెర లేపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మజాకా మూవీ టీమ్ కూడా అలాంటిదే మరో ప్రయోగం చేస్తోంది. ఈ సినిమాలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. జీ తెలుగు ఛానెల్ ఈ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ విషయాన్ని సోమవారం (ఫిబ్రవరి 17) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఛానెల్ వెల్లడించింది.

"ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో తొలిసారి చూడండి. మజాకా షూట్ లైవ్ వెళ్లబోతోంది. ఈ మూవీలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ చూడం...