Hyderabad, మార్చి 31 -- Zee Telugu Serials Timings: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ సాధించేవాటిలో జీ తెలుగు సీరియల్స్ కూడా ముందుంటాయి. అయితే ఈ ఛానెల్ లోని కొన్ని సీరియల్స్ ఈ మధ్యకాలంలో టీఆర్పీలను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్ కొన్ని సీరియల్స్ టైమింగ్స్ లో కొన్ని కీలక మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది.

కొన్నాళ్ల కిందట ఆదివారం కూడా సీరియల్స్ అంటూ జీ తెలుగు ఓ వినూత్నప్రయోగానికి తెర తీసిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడు దానికి ముగింపు పలికింది.

ముఖ్యంగా ప్రైమ్ టైమ్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య సీరియల్స్ ఇక ఆదివారం ఉండబోవని వెల్లడించింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10.30 మధ్య కూడా సీరియల్స్ ఉండవు. కొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు.. మరికొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు ...