భారతదేశం, మార్చి 1 -- జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మార్చి 3వ తేదీ నుంచి లక్ష్మీ నివాసం అనే కొత్త సీరియల్ ప్రారంభం కానుంది. ప్రతీ రోజు రాత్రి 7 గంటలకు ఆ సీరియల్ ప్రసారం అవుతుంది. అయితే, దీనివల్ల మూడు సీరియళ్లు ఎఫెక్ట్ అయ్యాయి. టైమింగ్స్ మారిపోయాయి. ఓ సీరియల్ సాయత్రం నుంచి మధ్యాహ్నానికి వెళ్లిపోయింది. మార్చి 3 నుంచి మార్పులు ఉండనున్నాయి. మూడు సీరియళ్ల కొత్త టైమింగ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

లక్ష్మీ నివాసం సీరియల్ జీ తెలుగులో మార్చి 3 నుంచి సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది. దీంతో ప్రస్తుతం ఆ టైమ్‍లో ప్రసారమవుతున్న 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ టైమ్ మారకతప్పలేదు. దీంతో మరో రెండు సీరియళ్లపై ప్రభావం పడింది. మార్చి 3వ తేదీన నుంచి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.

మా అన్నయ్య సీరియల్ ఓ అరగంట మ...