Hyderabad, ఏప్రిల్ 7 -- Zee Telugu Serial Review: జీ తెలుగు సోమవారం (ఏప్రిల్ 7) నుంచి సరికొత్త సీరియల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటలకు టెలికాస్ట్ కానుంది. తొలి ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు తమ రివ్యూలను పంచుకున్నారు.

జీ తెలుగు ఛానెల్లో సోమవారం నుంచి దీర్ఘసుమంగళీభవ సీరియల్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సీరియల్ చూసిన కొందరు ప్రేక్షకులు దీనికి మంచి రివ్యూలు ఇచ్చారు. ఓ ఇన్‌స్టా పేజ్ లో ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ ఎలా ఉందన్న అభిప్రాయం కోరగా.. స్పందించిన వాళ్లందరూ పాజిటివ్ రివ్యూలే ఇవ్వడం విశేషం.

తొలి ఎపిసోడ్ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు. చాలా బాగుంది అని ఒకరు.. సూపర్ ఆల్ ద బెస్ట్ అని మరొకరు.. ఇద...