Hyderabad, ఏప్రిల్ 1 -- Zee Telugu New Serial: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. తాజాగా ఈ సీరియల్ ప్రోమోను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీ, టైమ్ ను కూడా అనౌన్స్ చేసింది.

జీ తెలుగు ఛానెల్లోకి దీర్ఘసుమంగళీభవ సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (ఏప్రిల్ 7) నుంచి టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుందని ఆ ఛానెల్ వెల్లడించింది.

"ప్రాణత్యాగంతో మొదలైన ఇంద్ర గౌతమ్ ల స్నేహ బంధం.. భవిష్యత్తులో అహల్య కోసం మరో ప్రాణత్యాగానికి దారితీయనుందా" అంటూ ఈ సీరియల్ స్టోరీ గురించి జీ తెలుగు ఛానెల్ చెప్పింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ సీరియల్ ప్రోమో కూడా రిలీజైంది.

ఇంద...