భారతదేశం, ఫిబ్రవరి 5 -- Zahirabad Fraud: జహీరాబాద్‌లో జనానికి కుచ్చు టోపీ పెట్టిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సందాని భాష ఆతని ఇద్దరు కుమారులైన మహబూబ్ బాషా, అఫ్రిది భాషలు 30 సంవత్సరాల నుండి జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిర్ రోడ్డులో "ఎస్ఎండీ జువెలర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్" పేరుతో బంగారం వెండి వ్యాపారం నిర్వహించారు. కస్టమర్ల ఆర్డర్ ప్రకారం వారి వద్ద నుంచి డబ్బులు, బంగారం తీసుకోని వారు చెప్పిన ప్రకారము బంగారు అభరణములు తయారు చేసి ఇస్తూ ఉండేవారు.

చాలా సంవత్సరాలుగా పట్టణంలో నగల వ్యాపారం, తయారీలో మంచి పేరున్న భాషా కుటుంబానికి, చాల మంది నమ్మకమైన కస్టమర్లు ఉన్నారు. వారు చాల ముందుగా డబ్బులు చెల్లించి నగలు చేయించుకునేవారు. ఆ నమ్మకాన్ని సొమ్ముచేస...