భారతదేశం, మార్చి 4 -- Ysrcp Three Capitals : 2019-24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. శాసనరాజధానికి అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ మూడు రాజధానుల విషయాన్నే ప్రస్తావించింది. రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఏళ్లపాటు ధర్నాలు, నిరసనలు, యాత్రలు చేశారు. అయినప్పటికీ అప్పటి వైసీపీ సర్కార్ పట్టువీడలేదు. మూడు రాజధానులపై ముందుకే వెళ్లింది.

వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అమరావతి అంశాన్ని పక్కకు పెట్టి విశాఖపై దృష్టిపెట్టింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే విశాఖ నుంచి పాలన అంటూ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. ఇక...