భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో సోషల్ మీడియా పాత్ర ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే తమను ప్రమోట్ చేసుకుంటున్నారు. అటు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకొని.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్రపై తాజాగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం వైసీపీ సోషల్ మీడియా వింగ్. అన్ని పార్టీలకు ప్రత్యేక వింగ్‌లు ఉన్నా.. వాటితో వైసీపీ టీమ్‌కు పోలిక ఉండదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వేరే పార్టీలకు పనిచేసే సోషల్ మీడియా విభాగాల మాదిరిగా వైసీపీ వింగ్ పనిచేయదు. ఇతర పార్టీల విభాగాల లక్ష్యాలు ...