భారతదేశం, ఫిబ్రవరి 18 -- Ysrcp : సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని వైసీపీ..రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా)గా నియమించింది. వైసీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పూడి శ్రీహరిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించినట్లు ప్రకటించింది. శ్రీహారి గతంలో సీఎంకు సీపీఆర్వోగా పనిచేశారు.

సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(సీపీఆర్వో)గా పనిచేశారు. ఆయనకు రెండు దశాబ్దాలుగా మీడియాలో అనుభవం ఉంది. గతంలో ఈయన వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూశారు. అలాగే వైఎస్ జగన్ రాజకీయ జీవితం, ప్రజాసంకల్ప పాదయాత్ర విశేషాలతో 'అడుగడుగునా అంతరంగం' పేరుతో శ్రీహరి ఓ పుస్తకాన్ని రాశారు.

శ్రీహరి అనేక ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్‌ న్యూస్‌ కోఆర్డినేటర్‌, ఇన్‌పుట్‌ ఎడిటర్‌ సహా పలు ...