భారతదేశం, జనవరి 2 -- జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారని.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పు కూడా చేయలేదని తేలిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ పైనా ఇదే తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భవనాల రంగులకు రూ.4 వేల కోట్లు అని ప్రచారం చేశారని.. ఇప్పుడు వంద కోట్లు మాత్రమే ఖర్చు అయిందని లెక్క చెబుతున్నారని అన్నారు.

'అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని జగన్‌‌పై అభాండాలు వేశారు. వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష కోట్లు పైన అప్పు చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా.. తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఒక్కటి కూడా ఆచరించని విశ్వాసఘాతకుడు చంద్రబాబు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు మాటలకు అర్థా...