భారతదేశం, జనవరి 30 -- కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని.. వైసీపీ ఆరోపించింది. తాము విద్యార్థులకు అండ‌గా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 5న 'ఫీజు పోరు' పేరుతో ఉద్యమానికి రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు. జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా.. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో.. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా దీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్‌షిప్‌.. రెండూ కలిపి దాదాపు రూ.3900 కో...