భారతదేశం, మార్చి 16 -- వైసీపీ చీఫ్ జగన్ రాజకీయ వ్యూహాలు పక్కాగా ఉంటాయని.. ప్రత్యర్థులు పసిగట్టలేరని 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండేవారు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఆ నమ్మకం పోయింది. దీంతో చాలామంది నేతలు తమదారి చూసుకున్నారు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అయినా జగన్ తీరులో మార్పు లేదని.. సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.

ఎల్లప్పుడూ జగన్ వెన్నంటే ఉండే నాయకులు వెళ్లిపోయినా.. జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం వద్దని చెప్పినట్టు కూడా వార్తలు రాలేదు. పైగా వారిపై సోషల్ మీడియాలో దాడి పెరిగింది. దీనిపైనా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం, లీడర్లు వెళ్లిపోవడం సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంగా లబ్ధి చేకూరే విషయాల్లోనూ జగన్ తీరు మారడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జర...