భారతదేశం, మార్చి 18 -- బాధితురాలు శివ‌ల‌క్ష్మి తెలిపిన వివ‌రాల ప్రకారం.. క‌డ‌ప జిల్లా చాపాడు మండ‌లం న‌క్క‌ల‌దిన్నెకు చెందిన శెట్టిపల్లి విశ్వ‌నాథ‌రెడ్డి.. త‌న భార్య శివ‌ల‌క్ష్మికి 2024 అక్టోబర్ 29న ప్రొద్దుటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించాడు. ఆప‌రేష‌న్ చేసే క్ర‌మంలో వైద్యుల నిర్ల‌క్ష్యంతో ఆమె పేగుకు రంధ్రం ప‌డింది. ఆమెకు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. దీని గురించి తెలుసుకున్న విశ్వ‌నాథ‌రెడ్డి కుటుంబం.. ఆప‌రేష‌న్ చేసిన వైద్యురాలు ఇన‌య‌రాణిని ప్ర‌శ్నించారు. అయితే ఆమె అదేమీ కాలేద‌ని నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చారు.

రెండు రోజుల త‌రువాత స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుప‌త్రిలో చూపించారు. అక్క‌డి వైద్యులు ప‌రీక్షించిన త‌రువాత‌ ఇన్‌ఫెక్ష‌న్ సోకింద‌ని, హైద‌రాబాద్ తీసుకెళ్లాల‌ని సూచించారు. మ‌ళ్లీ విశ్వ‌నాథ‌రెడ్డి సెకెండ్ ఒపినియ‌న్ ...