భారతదేశం, జనవరి 26 -- YSR Congress Party : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం... 11 సీట్లకే పరిమితమవ్వడం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గ్రాఫ్ ను చక్కదిద్దే పనులు వైసీపీ చేస్తుందా? అంటే లేదనే చెప్పాలి. ఇక తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఎన్నికల సమయానికి అసలు పార్టీలో ఎవరుంటారో? లేరో? అనే సందేహం కలుగుకుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలంతా సైలెంట్ అవ్వడం, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడంతో...పార్టీ పరిస్థితిపై అంతర్గత చర్చ మొదలైందని సమాచారం.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం..ఆ పార్టీకి అతిపెద్ద దెబ్బ. ఆయన తర్వాత ఇంకెంత మంది పార్టీని వీడుతారో? అనే సందేహాలు మొదలయ్యాయి. వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉం...