ఆంధ్రప్రదేశ్,అమరావతి, జనవరి 23 -- అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలన్నారు. గౌతమ్ అదానీపై చర్యలకు కచ్చితమైన సమాచారం కావాలని చంద్రబాబు మాట్లాడటం అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గతంలో తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు..? ప్రశ్నించారు.

"గౌతమ్ అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు ? అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల...