భారతదేశం, ఫిబ్రవరి 24 -- YS Sharmila : ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు గురించి గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.

"గవర్నర్ ప్రసంగంలో పసలేదు. దిశానిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్ధసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. చంద్రబాబు విజన్ 2047కి దమ్ము లేదు. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదు. హామీల అమలు కోసం ఎదురుచూస్త...