ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఫిబ్రవరి 7 -- మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రెడిబులిటి ఖాలీ బాటిల్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ క్రెడిబులిటి సున్నా అని. సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తులు కాజేయ్యలని కుట్రలు చేశాడని ఆరోపించారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని దుయ్యబట్టారు.

" విజయసాయిరెడ్డి తో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారు. నా బిడ్డలకు సంబంధించిన ఒక విషయం చెప్తున్నాను. జగన్ గారు సొంత తల్లి మీద కేసు పెట్టించారు. ఆ కుట్రను నేను బయట పెట్టా. నేను నిజాలు చెప్పాను అని జగన్ నా మీద అబద్ధాలు చెప్పాలని సాయి రెడ్డికి చెప్పాడు. సాయి రెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారు. స్వయంగా సాయి రెడ్డికి జగన్ కాల్ చేశాడు. ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశా...