భారతదేశం, ఫిబ్రవరి 23 -- YS Sharmila : వైసీపీ, టీడీపీ బీజేపీకి(BJP) తొత్తులుగా మారి ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ, టీడీపీ బీజేపీకి బానిసలుగా మారారన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. ఏపీ హక్కుల కోసం కలిసి పోరాడే అంశంపై చర్చించామన్నారు. కలిసి కట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు. అనంతపురం సభకు సీపీఐ, సీపీఐలను ఆహ్వానించామన్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పొత్తులపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్(Congress) 2014 అధికారంలో వచ్చి ఉంటే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. హోదా విషయంలో జగన్...