ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఏప్రిల్ 4 -- తల్లి మీద కేసు వేసిన వ్యక్తి జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత మేనకోడలు, మేనల్లుడికి ద్రోహం చేసిన వ్యక్తిగా నిలిచిపోతారని మండిపడ్డారు. విజయవాడలో వక్ఫ్ బిల్లు, పోలవరం ప్రాజెక్టు అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ ఆస్తులపై స్పందించారు. ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్ పై చర్చ జరిగిందని. దానిపై స్వయంగా MOU లో సంతకం పెట్టారని గుర్తు చేశారు.

ఆస్తులు ఎవరికి ఏవి అనే దానిపై జగన్ సంతకం చేశారని షర్మిల గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. గిఫ్ట్ ఇచ్చింది తనకు కాదని. తల్లి విజయమ్మకు ఇచ్చారని చెప్పారు. అప్పుడు ఇచ్చిన షేర్లను ఇప్పుడు వెనక్కి అడుగుతున్నారని. ఇది తల్లికి చేస్తున్న మోసమన్నారు.

"జగన్ గారు స్వయంగా ఎంఓయూలోసంతకం పెట్టారు. ఆస్తులు ఎవరికి ఏవి అనేది సంతకం చేశారు...