భారతదేశం, జనవరి 28 -- YS Sharmila: . పథకాలు కావాలంటే ప్రభుత్వ ఆదాయం పెంచాలని మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లు చంద్రబాబు తీరు ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని,50 లక్షల మంది అన్నదాతలను వంచించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని ఆరోపించారు.

చంద్రబాబు కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని, పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, YCP ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని చెబుతున్నారని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం గురించి తెలియదా అని ప్రశ్నించారు.

'సూపర్ సిక్స్' పథకాల రూపకల్పనలో చేసేటపుడు రాష్ట్ర ఆర్థిక భారం కనిపించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం...