భారతదేశం, ఫిబ్రవరి 6 -- Ys Jagan On CBN: ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఎన్నికల వేళ ముసలామె కూడా బటన్‌ నొక్కుతుందని,అదేమైనా గొప్ప విషయమా అన్నారని.. అంతటితో సూపర్‌ సిక్స్‌ అంటూ మ్యానిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల్ని పంపినపుడు చెప్పిన మాటలు ఎవరు మర్చిపోలేదన్నారు.

పిల్లలకు 15వేలు, పెద్దలకు 18వేలు అంటూ మహిళల్ని మోసం చేశారని, 50ఏళ్లు నిండితే వారికి 48వేలు ఇస్తామన్నారని, రైతులకు రూ.20వేలు, యువతకు డబ్బులిస్తామని మోసం చేశారని జగన్ ఆరోపించారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు పంచిపెట్టారని, అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారని గుర్తు చేశారు.

పంచిన పంప్లెట్లు ఏమయ్యాయని, హామీలు ఏమయ్యాయని ఇప్పుడు జనం ఎవరి ...