గుంటూరు,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 19 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు మిర్చియార్డ్‌ కూతవేటు దూరంలోనే ఉందని. అయినా మిర్చి రైతుల అవస్థలు, కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని ఆక్షేపించారు.

బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్. మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో మిర్చి ధర క్వింటాకు రూ. 21వేలు పలికిందని గుర్తు చేశారు. కానీ ఇవాళ కేవలం 10, 11 వేలకు కూడా కొనేనాథుడు లేడన్నారు. పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు బతకడానికే కష్టపడుతున్నాడని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా రైతుకు గిట్టుబాటు ధరలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని...