భారతదేశం, ఫిబ్రవరి 9 -- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం జగన్ నివాసం పరిసరాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఓటమి అనంతరం జగన్ నివాసం ఎదుట ర్యాలీలు చేపడుతూ.. రాజకీయ నినాదాలతో కొంత మంది యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

గతేడాది సెప్టెంబర్ 22న తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. ఇంటి గేట్ల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. జగన్ ఇంటి గోడలపై ఎరన్రి సింధూరం పూశారు. గేట్లకు కాషాయ రంగు రాశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇటీవల మం...