విజయవాడ,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 5 -- విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని.. ఇది వేరేగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు.

"తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. కార్యకర్తలతో కోసం జగన్ గట్టిగా నిలబడతాడు?" అని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు.

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నిజస్వరూపం జనాలకు పూర్తిగా అర్ధం అవుతుందన్నారు జగన్. కాబట్టి ఈసారి జనం మనల్ని 30 ఏళ్ళు కూర్చోబెడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం మ...