భారతదేశం, మార్చి 27 -- YS Jagan Campaign: సిఎం జగన్‌ Ys jagan నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ Idupulapaya నుంచి మేమంతా సిద్ధం memantha Siddham పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. తొలి రోజు ప్రచారాన్ని కడప పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

తొలి రోజు యాత్రలో వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా జగన్ బస్సు యాత్ర jagan Bus Yatra సాగనుంది. ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డు వద్ద రాత్రి శిబిరానికి చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులోనే రాత్రికి సిఎం జగన్ బస చేస్తారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం Ichhapuram వరకు ఏకబిగి...