భారతదేశం, జనవరి 12 -- YS Jagan : టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6 గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు తన చుట్టూ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ కుప్పం కార్యక్రమంలో పోలీసులను పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణమన్నారు.

తొక్కిసలాటపై విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన బాధ్యులను చంద్రబాబు ప్రభుత్వం విడిచిప...