భారతదేశం, ఫిబ్రవరి 14 -- రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని.. వైసీపీ చీఫ్ జగన్ వ్యాఖ్యానించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని ట్వీట్ చేశారు.

'గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి.. తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చాడు. అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే.. తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక.. దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు' చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

'సత్యానికి కట్టుబడి నిజా...