భారతదేశం, జనవరి 27 -- YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నారు. బెయిల్‌ రద్దు చేయడానికి సహేతుకమైన కారణాలను వివరించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు సుప్రీం కోర్టులో పిల్ దాకలు చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వివరించే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రికి బెయిల్‌ మంజూరైన తర్వాత విచారణకు హాజరు కావడం లేదని, కేసుల విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని, మొత్తం విచారణకు ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.

మరోవైపు జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని ప్రతివాదుల...