భారతదేశం, ఫిబ్రవరి 5 -- Ys Jagan: ఎన్నికల హామీల అమలును విస్మరించడంతో పాటు చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు బలంగా వివరించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి పార్టీ సీనియర్లకు సూచించారు. మంగళవారం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, పార్టీ సీనియర్‌ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.

రెండు వారాల లండన్‌ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.

ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ అమలు విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన, ఎన్నికల హామీల అమలుపై ఆయన వైఖరిని మరోసారి తేటతెల్లం చేశా...