Hyderabad, ఏప్రిల్ 7 -- Youtube Thriller Movie: సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సినిమాలంటే ఇష్టపడే వారు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ సినిమాను మిస్ కావద్దు. ఓటీటీ అయితే సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. కానీ యూట్యూబ్ లో ఎవరైనా ఫ్రీగా చూసే వీలుండే ఎన్నో మూవీస్ ఉన్నాయి. అందులో ఇదీ ఒకటి. ఎన్నో మలయాళం సినిమాలు తెలుగులో డబ్ చేసి వాటిని ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నారు.

మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫోరెన్సిక్ (Forensic). టొవినో థామస్, మమతా మోహన్‌దాస్, సైజు కురుప్ లాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. 2020లో రిలీజైన ఈ మూవీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

2022లోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది. అది కూడా తెలుగులో కావడం విశేషం. జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు యూట్యూబ్ లో చూడొచ్చు.

ఫోరెన్సిక్ ...