భారతదేశం, ఫిబ్రవరి 9 -- యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్. ఇటీవల దాని వార్షిక ఆదాయ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2024లో యూట్యూబ్ 36.2 బిలియన్ డాలర్లు ప్రకటనల ద్వారా సంపాదించింది. ఈ ఆదాయం యాడ్స్ ద్వారా వచ్చినది మాత్రమే. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ టీవీవంటి వాటి నుంచి వచ్చిన ఆదాయం వేరుగా ఉంది. అంటే మిగిలిన ఆదాయం కలిపితే మరింత పెరుగుతుంది.

2024 చివరి త్రైమాసికంలోనే ప్రకటనల ద్వారా యూట్యూబ్ 10.47 బిలియన్ల డాలర్లు ఆర్జించింది. ఏ త్రైమాసికంలోనూ ప్రకటనల సహాయంతో ఇంత ఆదాయం సంపాదించలేదు. అంటే 2024 ఏడాదిలో 36.2 బిలియన్ డాలర్లు సంపాదిస్తే.. కేవలం చివరి త్రైమాసికంలో 10.47 బిలియన్ల డాలర్లను సంపాదించింది. యూట్యూబ్ యాడ్స్ ద్వారా రికార్డు బద్దలు కొట్టింది.

అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలకు సంబంధించి...