భారతదేశం, మార్చి 1 -- దేశానికే రోల్‌ మోడల్‌గా ఉండేలా..యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను తీర్చిదిద్దాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం.. యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. స్కూల్ యూనిఫామ్స్‌ నమూనాలు పరిశీలించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని స్పష్టం చేశారు. క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి.. పోలీస్‌ అమరుల కుటుంబాల పిల్లలకు.. అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూల్‌లో 50 శాతం పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కే...