Hyderabad, మార్చి 23 -- మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తనతో పాటు మరో ప్రాణాన్ని మోస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ ప్రసవం జరిగేందుకు ప్రయత్నించాలి. అయితే, గర్భధారణ అందరిలోనూ ఒకే రకంగా జరగదు. కొందరికి కష్టాలతో, మరికొందరికీ సాఫీగా జరిగిపోతుంది. కడుపులోని బిడ్డ కదలికల విషయంలో, ఉమ్మ నీరు, శిశువు ఎదుగుదల లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంచకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా, పసిబిడ్డ రాకతో వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి. అందులో యోగా ఒకటి.

గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవడానికి యోగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి, రెగ్యూలర్‌గా యోగా చేసే వాళ్లు కాకుండా, ప్రెగ్నెన్సీ సమయంలోనే యోగా చేయాలనుకునేవారు ఎప్పుడు మొదలుపెట్టాలి. ఏ సమయంలో ఎలాంటి ఆసనాలు వ...