Hyderabad, మార్చి 2 -- పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో పిల్లలు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొందరు పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ చదువుపై ఆసక్తి కనబరచలేరు. ఇందుకు కారణం పరీక్షలనగానే వచ్చే భయం, ఆందోళన కూడా అయి ఉండచ్చు. ఏదేమైనా మీ పిల్లలలోని ఈ భయాన్ని పొగొట్టి వారిలో శ్రద్ధ, ఆసక్తులను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఉంది. ఇందుకోసం మీరు వారిపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

ముఖ్యంగా పరీక్షలు దగ్గర పడుతున్న ఈ సమయంలో వారి ఆహారం, నిద్ర విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వారిలో ఆందోళన తగ్గించి శ్రద్ధను పెంచే కొన్ని యోగాసనాలను ప్రతిరోజూ చేయించండి. ఈ ఆసనాలు పిల్లలు చదువుపై శ్రద్ధను పెంచడంతో పాటు ఎల్లప్పుడూ వారు ఉత్సాహంగా ఉండేందుకు పరీక్షలు రాసేందుకు చాలా బాగా సహాయపడతాయి.

ముందుగా చాప లేదా యో...