Hyderabad, ఏప్రిల్ 7 -- యోగాసనాలు వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం చేసే ప్రతి యోగాసనం వెన్నెముకను సమలేఖనం చేయడంతో పాటు, దానికి మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మహిళలు తమ రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగ అవసరాల ఆధారంగా శరీరానికి సరిపడే యోగాసనాలను ఎంచుకోవాలి.

ఉదాహరణకు, డెస్క్ ఉద్యోగాలు చేసే వారికి శారీరక శ్రమ తక్కువ. అయినప్పటికీ ఎక్కువగా మనసు కేంద్రీకరించి పని చేయాలి. దీంతో శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. అటువంటి వారికి సూర్యనమస్కారాలు అత్యంత అనువైనవి. సూర్యనమస్కారాల క్రమం అనేది వెన్నెముక విస్తరణ, వంగడానికి కావాల్సిన సమతుల్య కలయిక ద్వారా శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సూర్య నమస్కారాలు వెన్నెముక సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వెన్నెముక, భుజాలు, చేతులు, కాళ్ళ కండరాలను బలపరుస్తాయి.

అదే...