Hyderabad, ఏప్రిల్ 5 -- రొమ్ములు వదులుగా మారి వేలాడుతూ కనిపించడం చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇలా జారిపోతూ కనిపించే బ్రెస్ట్ ఆడవారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. నలుగురిలోనూ నామూషీగా, అసౌకర్య భావనకు కారణమవుతుంది. ముఖ్యంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు బ్రెస్ట్ సాగదీత సమస్యతో బాధపడుతున్నారు.

వాస్తవానికి జారిపోతున్న రొమ్ములను బిగుతుగా మార్చుకోవడానికి కొన్ని వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు సహాయపడతాయి. కానీ నేటి గజిబిజి జీవితంలో మహిళలకు వ్యాయామాలు చేసే సమయం ఉండకపోవడం మరొక సమస్యగా మారింది. ఇంటి పనీ, ఆఫీసు పనీ, పిల్లల పనీ అంటూ వారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఉరుకులు పరుగులతో సమయాన్ని గడుపుతున్నారు.

ఇలా రొమ్ములను బిగుతుగా, అందంగా మార్చుకునేందుకు సమయం లేని వారు.. కొన్ని సులువైన యోగాసనాలు చేసి పరిష్కారాన్ని పొందచ్చ...