Hyderabad, ఫిబ్రవరి 18 -- ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య యేసుభాయి భోంస్లే గురించి మరాఠాలు ఇప్పటికీ చెప్పుకుంటారు. చారిత్రక విషయాలను సినిమాల రూపంలో చిత్రీకరిస్తుంటే యేసుభాయిలాంటి వీరవనితల గురించి ప్రజలకు తెలుస్తోంది. చావా సినిమా చూసిన వారందరికీ యేసుభాయి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కచ్చితంగా పుడుతుంది. ప్రముఖ చారిత్రక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్. ఆయన భార్య యేసు భాయి భోంస్లే. సినిమాలో చూసిన దానికన్నా ఈమె గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి.

శౌర్యం, ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన ఎనిమిది వివాహాలు చేసుకున్నారు. అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ ఎనిమిది వివాహాల వల్ల శివాజీకి ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు శంభాజీ. శంభాజీ...