భారతదేశం, మార్చి 6 -- మంత్రి నాదెండ్ల మనోహర్‌పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పీడీఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తనిఖీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు, పవన్‌పై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.

'చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్‌. హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు. జగన్‌ రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు.. చంద్రబాబు విష ప్రచారం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. లోకేష్‌కు ఈసారి ఘోర ఓటమి తప్పదు' అని మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి అంబ‌టి రాంబాబు సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. 'అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన త...