భారతదేశం, ఫిబ్రవరి 27 -- మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంటికి విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెళ్లారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్‌ 35/3 కింద నోటీసులు అందజేశారు. మార్చి 5న సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.

పోలీసులు ఇచ్చిన నోటీసుల వివరాల ప్రకారం. పోక్సో కేసుకు సంబంధించి నవంబర్‌ 2, 2024న సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారించేందుకు. తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్ కు నోటీసులు ఇచ్చారు.

విజయవాడ పోలీసుల నోటీసులపై గోరంట్ల మాధవ్ స్పందించారు. న్యాయ నిపుణులను సంప్రదించి. కేసును ఎదుర్కొంటానని చెప్పారు. అరెస్టులకు అదిరేది, బెదిరేది లేదని స్పష్టం చేశారు. పోక్సో కేసులోని బాధితుల పేర్లు చెప్పానని తనపై కేసు నమోద...