భారతదేశం, ఏప్రిల్ 15 -- YCP Challenges Waqf Act: వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ పార్లమెంటు చట్టసవరణను సవాలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్‌ చట్ట సవరణలో తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని, ఇది ముస్లిం సమాజం ఆందోళనలను పరిష్కరించడంలో విఫలమైందని వైసీపీ పేర్కొంది.

వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది మహ్ఫూజ్ అహ్సాన్ నజ్కీ ఈ పిటిషన్ దాఖలు చేశారని, ఈ కేసును మంగళవారం విచారించే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

వక్ఫ్ చట్టం-1995కు సవరణలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవరణల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ... మతం ఆధారంగా వివక్ష చూపేలా కొత్త చట్టం ఉందని పిటిషన్‌లో పేర్కొంది.

ఆర్టికల్ 14, 15లను ఉల్ల...