భారతదేశం, ఫిబ్రవరి 8 -- Yatra 2 Twitter Review: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పొలిటిక‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. ఈ పొలిటిక‌ల్ జోన‌ర్‌లో వ‌చ్చిన తాజా మూవీ యాత్ర -2. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాకు మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ న‌టుడు జీవా చేశాడు. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించాడు. యాత్ర 2 ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే..

యాత్ర 2 మూవీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జీవితాన్ని డైరెక్ట‌ర్‌ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఎమోష‌న‌ల్‌గా చూపించాడ‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. జ‌గ‌న్ పాత్ర‌కు జీవా పూర్తిగా న్యాయం చేశాడ‌ని, త‌న మేన‌రిజ‌మ్స్‌, బాడీలాంగ్వేజ్‌తో చాలా చోట్ల జ‌గ‌న్‌ను జీవా గుర్తుచేశాడ‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ జీవితంలో...