భారతదేశం, ఏప్రిల్ 2 -- భారత డొమెస్టిక్ క్రికెట్ టీమ్ ముంబయికి యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ షాకిచ్చాడు. రాబోయే దేశవాళీ సీజన్ కోసం ముంబయిని వదిలి గోవాకు వెళ్లాలని అతను ఆలోచిస్తున్నాడు. స్విచ్ చేయడానికి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్- ఎన్ఓసీ) కోరుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు ఈ-మెయిల్ పంపించాడు. 23 ఏళ్ల జైస్వాల్ ఎన్ఓసీ కోరినట్లు ఎంసీఏ వర్గాలు బుధవారం హిందుస్థాన్ టైమ్స్ కు ధృవీకరించాయి.

టీమిండియా తరపున టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో సాగుతున్న యశస్వి జైస్వాల్.. దేశవాళీల్లో ముంబై తరపునా అదరగొడుతున్నాడు. అయితే అతను సడన్ గా ముంబై వదిలి గోవాకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాలు తెలియరాలేదు. ''అవును, ఎన్ఓసీ కోరుతూ యశస్వి నుంచి మాకు అభ్యర్థన అందింది. రాబోయే దేశవాళీ సీజన్ కోసం గోవాకు వెళ్లాలనే కోరికను వ్యక్తం చేస్తూ అతని ...