Hyderabad, ఫిబ్రవరి 25 -- Yash Toxic Shooting In English And Kannada: భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది.

రాకింగ్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా టాక్సిక్ మూవీని షూట్ చేస్తుండటంతో చిత్ర నిర్మాతల నిబద్ధత ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయ భాషకు వారు ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయాలన్న ఉద్దేశాన్ని ఇలా చెప్పకనే చెప్పేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గీతూ మోహ...