భారతదేశం, ఫిబ్రవరి 23 -- కశ్మీరీ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ యానా మీర్ (Yana Mir) యూకే పార్లమెంటులో ఇటీవల ప్రసంగించారు. అక్కడ మాట్లాడుతూ తాను మలాలా యూసఫ్జాయ్ ని కాదని, ఎప్పటికీ మలాలా యూసఫ్జాయ్ ని కాబోనని ఆమె ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. తన స్వదేశమైన భారత్ లో భాగమైన కశ్మీర్లో తాను పూర్తిగా సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఆమె ప్రసంగం ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.

యూకే పార్లమెంట్లో ఇటీవల 'సంకల్ప్ దివస్' నిర్వహించారు. ఆ సందర్భంగా కశ్మీరీ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ యానా మీర్ (Yana Mir) అక్కడ ప్రసంగించారు. ''నేను మలాలా యూసుఫ్ జాయ్ ను కాదు.. కాబోను. ఎందుకంటే నేను నా మాతృ దేశం భారత లో భాగమైన మాతృ భూమి కాశ్మీర్ లో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. మలాలా యూసఫ్ జాయ్ లాగా నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి మీ దేశంలో ఆశ్రయం పొందాల్సి...