భారతదేశం, జనవరి 31 -- Yamaha discounts: యమహా మోటార్ ఇండియా యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్ పై, అలాగే యమహా ఎంటీ-03 బైక్ పై భారీ ధరల తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2025 నుండి ఈ రెండు బైకులు రూ. 1.10 లక్షల వరకు ధర తగ్గింపును పొందుతాయి. ఈ డిస్కౌంట్ తో మరింత ఆకర్షణీయంగా మారాయి.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 ధర రూ.1.05 లక్షలు తగ్గింది. ఈ డిస్కౌంట్ అనంతరం ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.3.60 లక్షలకు చేరింది. యమహా ఎంటీ-03 బైక్ ధర ఏకంగా రూ.1.10 లక్షలు తగ్గి రూ.3.50 లక్షలకు చేరింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ డిస్కౌంట్ ల అనంతరం, యమహా ఆర్ 3 మరియు ఎంటి -03 బైక్స్ మరింత చవకగా మారాయి. ప్రీమియం మోటారు సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి, కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా ధరల తగ్గుదల ఉందని కంపెనీ తెలిపింది. ఆర్ 3 ఇప్పుడు అప్రిలియా ఆర్ఎస్ 457 కంటే తక్...