భారతదేశం, ఫిబ్రవరి 17 -- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబు చేశారు. ఎల్లుండి నుంచి 23 వరకు మహాక్రతువు జరగనుంది. ఇప్పటికే ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తయ్యాయి. 108 మంది రుత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకురానున్నారు. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు.

కొండపైన పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు నిర్వహించనున్నారు. 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం జరగనుంది. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్వికులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహించనున్నారు. 23న సుమారు లక్షమందికి పులిహోర ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మ...