తెలంగాణ,యాదగిరుగుట్ట, మార్చి 1 -- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్లైంది. ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేకంగా సాంస్కృతికోత్సవాలను కూడా ఏర్పాటు చేశారు.

వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా.. కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఇటీవలనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ ని...