భారతదేశం, ఫిబ్రవరి 4 -- Yadagirigutta: యాదగిరి గుట్ట జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆదిమానవులు సమాధులను తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామంలో ఉన్న చరిత్ర ఔత్సాహికుల కోరిక మేరకు, ఆ గ్రామంలో పర్యటించిన, హరగోపాల్ అక్కడ ఉన్నఆది మానవుల సమాధిని కూడా గుర్తించారు. ఈవూర్లో దేవతల గుట్టగా పిలువబడే చిన్నగుట్టల వరుస వుంది.

రెండు గుట్టల నడుమ చిన్నలోయ, లోయలో గుహలు, దొనెలు, సొరికెలు చాలా వున్నాయి. ఒక చిన్నదొనెలో వారికీ మెరుగు పెట్టని చిన్న,చిన్న ఆదిమానవుల రాతిపనిముట్లు దొరికాయి. వాటిలో వడిసెల రాళ్ళు, రాతి సుత్తెలు,గొడ్డళ్ళుగా చేయడానికి సిద్ధపరిచిన రాతి ముక్కలు,బొరిగెల వంటివి వున్నాయి. అక్కడే వేణుగోపాల స్వామి గుడి వుంది.

గుడికి తూర్పున బండ గట్టుగా ఒక ఆదిమానవుల సమాధి వుంది. 16 చిన్నచిన్న రాతి గుండ్లను సమాధి చుట్టు పేర్చారు . అది ఒక కైరన్ సమాధి. ఇంకా సమాధుల...