భారతదేశం, నవంబర్ 27 -- యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Power Plant) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది పవర్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. పనులను సీఎం కేసీఆర్(CM KCR) నవంబర్ 28వ తేదీన పరిశీలిస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్.. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద థర్మల్ ప్లాంట్‌ గా నిలవనుంది.

నల్గొండ(Nalgonda) జిల్లా దామరచెర్ల మండలంలో రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఇకపై తెలంగాణ(Telangana)కు విద్యుత్ లోటు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నందున, ఎన్నికలకు ముందే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసక...