యాదాద్రి జిల్లా,తెలంగాణ రాష్ట్రం, ఫిబ్రవరి 6 -- ఉదయం 5 అవుతోంది..! భరత్ చంద్ర అనే పిలుపు వినిపిస్తోంది. డోర్ తీసి చూస్తే. జిల్లా ఉన్నతాధికారి దర్శనమిచ్చారు. వచ్చింది ఎవరో కాదు. జిల్లా కలెక్టర్ అని తెలిసి విద్యార్థితో పాటు కుటుబమంతా కూడా ఆశ్చ్యర్యానికి గురైంది. అ అనూహ్య ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే. త్వరలోనే పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో ప్రతి జిల్లా కూడా సత్తా చాటాలని, ఉత్తీర్ణత శాతం పెరిగాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు "విద్యార్థుల ఇంటి తలుపు తట్టే(Knocking on Doors)" కార్...